తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవు..

ఎంపీ మిథున్‌రెడ్డి

విజ‌య‌వాడ‌:  కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నామని, ఈ నిర్ణ‌యంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ కర్తవ్యమని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top