స‌చివాల‌య సిబ్బందితో ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ స‌మావేశం

విజ‌య‌న‌గ‌రం:  చీపురుపల్లి పట్టణం 3,5వ‌ సచివాలయాల సిబ్బందితో ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ రెండు స‌చివాల‌యాల‌ పరిధి లో సమస్యల పట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవ‌ల చీపురుపల్లి పట్టణంలో  3, 5వ సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ స‌మ‌యంలో ప్రజల నుంచి వచ్చిన ప్రధాన సమస్యలపై సచివాలయ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించి,వాటి పరిష్కరం కోసం తగు సూచనలు చేశారు.  స‌మావేశంలో ఎంపీటీసీ గెరిడా రామదాసు, పట్టణ పార్టీ నాయకులు ముల్లు పైడిరాజు, అప్పికొండ అధిబాబు, తదితరులు పాల్గొన్నారు 

తాజా వీడియోలు

Back to Top