అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ, భూ కబ్జాదారుడు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌
 

శ్రీకాకుళం:  టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ, భూ కబ్జాదారుడని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ విమర్శించారు. అయ్యన్న ఇరిగేషన్‌ కాలువను ఆక్రమించుకున్నారని తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి స్టే తెచ్చుకున్నాడని చెప్పారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అయ్యన్నపాత్రుడు చేసిన అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు భరించలేక నియోజకవర్గ ప్రజలందరూ అయ్యన్నను నియోజకవర్గం నుంచి తరిమికొట్టాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అచ్చెన్నాయుడుని కూడా నియోజకవర్గంలో అడుగుపెడితే తరిమికొడతామని ప్రజలందరూ హెచ్చరిస్తున్నారు.  అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేస్తే బీసీలకు అన్యాయం జరిగిందని తెలుగు దొంగల పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు
- అయ్యన్నపాత్రుడు చేసిన అన్యాయాలు, అక్రమాలపై చట్ట పరిధిలో తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ప్రజలు మీ అన్యాయాల్ని చూస్తూ ఊరుకోరు..
- గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడు.. ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉండాలా? ఏమిటి వీళ్ల గుండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం, భూఅక్రమణలు..?
- అయ్యన్నపాత్రుడు వ్యభిచారి, వ్యసనపరుడు, భూకబ్జాదారుడు, దొంగని ప్రపంచానికి తెలుసు.. మీ దొంగల ప్రభుత్వంలో మీ ఆటలు సాగాయి.. ఇప్పుడు సాగవు.
- పూర్తి పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా, నేరుగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం ఇది. 
- అయ్యన్నపాత్రుడి లాంటి వాళ్లు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా? రాష్ట్రం మీ అబ్బ జాగీరు కాదు.. చట్టం చూస్తూ ఊరుకోదు..
 
 టీడీపీలోని బీసీ నేతలు.. ముందుగా,  బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు, లోకేష్ లను ప్రశ్నించాలి.
- బీసీలకు అన్యాయం చేసింది టీడీపీ కాదా?.  ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అనలేదా.?
- బీసీలు ఉన్నత పదవులకు పనికిరారు, బీసీలను న్యాయమూర్తులుగా కూర్చోబెట్టకూడదని, వాళ్లకి మేధస్సు ఉండదని చెప్పింది ఎవరు? చంద్రబాబు కాదా?
- లోకేష్ బీసీలను ఉద్ధేశించి హీనంగా మాట్లాడలేదా? చంద్రబాబు, లోకేష్ బీసీలను కించపరుస్తూ మాట్లాడిన మాటల మీద, దూషణల మీద,  బీసీలకు చేసిన అన్యాయం మీద ప్రశ్నించండి..

 బీసీలకు సంపూర్ణ న్యాయం చేస్తోంది జగన్ గారే..
- బీసీ జాబితాలోని అన్ని కులాలను గుర్తించి, అందరికీ సమన్యాయం చేసి, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలు కులం, మతం, ప్రాంతం, జాతి, జెండా, రంగు,  రాజకీయం చూడకుండా, బడుగుబలహీన వర్గాలకు, శ్రామిక, తాడిత, పీడిత, కర్షక వర్గాలన్నింటికీ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి లంచానికి తావులేకుండా నేరుగా ప్రజలకు అందిస్తున్న నిజాయితీ ప్రభుత్వం ఇది.
- బీసీలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మాది.. బీసీలకు మేలు చేసే ప్రభుత్వం ఇది..
- బీసీలను ఉపముఖ్యమంత్రులను, కార్పొరేషన్లకు ఛైర్మన్లను చేసిన ప్రభుత్వం మాది
- బీసీలను అగ్రస్థానంలో కూర్చోబెట్టిన ప్రభుత్వం మాది.. ఎస్సీ, ఎస్టీలను అగ్రస్థానంలో కూర్చోబెట్టిన ప్రభుత్వం ఇది..
- మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, మోసాలకు పోలీసులు కేసు పెడితే బీసీలకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారా..?
- మీరు బీసీలను మోసం చేసిన బీసీ దొంగలు.. బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.

 ప్రజలను ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడితే తాట తీస్తాం జాగ్రత్త.. చంద్రబాబు, ఆయన కొడుకు చేసిన తప్పుడు పనులకు మీరంతా ఊడిగం చేసి, వెధవ పనులు చేస్తే చర్యలు తీసుకోకూడదా? 
- టీడీపీ ప్రభుత్వంలో భాగంగా ఉండి, మీ అధికారాలను దుర్వినియోగం చేసింది నిజం  కాదా? అధికారంలో ఉండి అమరావతిలో రాజధానిలో భూకబ్జాలు చేశారు.. 
- తెలుగు దొంగల పార్టీలో అచ్చెన్నాయుడు భూకబ్జాలు చేస్తూ, గ్రానైట్ మినరల్స్ అన్నింటీని కూడా అక్రమ రవాణా చేసి అమ్మేశాడు, పీఏసీఎస్ లో రూ.12కోట్లు దోపిడీ చేశాడు. నిమ్మాడలో 2.5ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడౌన్ల నిర్మాణం చేశాడు. ఈఎస్ఐలో సుమారు రూ.150కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు.. ఈ విధంగా మీరు అక్రమాలు చేస్తూ, అవినీతికి పాల్పడితే తప్పు కాదా? ప్రభుత్వాలు మాట్లాడకూడదా? కళ్లుమూసుకుని కూర్చోవాలా.?

లోకేష్ నేతృత్వంలోని ఐటీడీపీ - సోషల్ మీడియా వేదికగా, మహిళల గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి, మహిళా ప్రజాప్రతినిధుల గురించి ఇష్టానుసారంగా దూషిస్తే ప్రభుత్వం స్పందించకూడదా..?. రాష్ట్రం మీ అబ్బా జాగీరు అనుకుంటున్నావా అయ్యన్నపాత్రుడు.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చట్టం ఊరుకుంటుంది అనుకుంటున్నావా? .
- నీ ఆక్రమణలపై, అన్యాయాలపై చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైంది. 
- భూకబ్జాలు చేయడం మీ నాయకుడుకి, మీ పార్టీలోని నాయకులకు అలవాటు.. అందుకే మీది తెలుగు దొంగల పార్టీ

తాజా వీడియోలు

Back to Top