ప్రజల మనిషి సీఎం వైయస్‌ జగన్‌

ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి
 

అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల మనిషి అంటూ గుంతకల్‌ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి కొనియాడారు. బుధవారం ముంబాయి నుంచి రాయలసీమకు చెందిన వలస కూలీలు శ్రామిక ఎక్స్‌ప్రెస్‌ రైల్లో అనంతపురంకు చేరుకున్నారు. వలస కూలీలకు వెంకట్రామిరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. బతుకు దెరువు కోసం ముంబాయి వెళ్లిన వలస కూలీలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకొని వారిని స్వస్థలాలకు తీసుకువచ్చారన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

Back to Top