అమరావతి రైతుల పాదయాత్రపై ఫిర్యాదు

  ప్రకాశం జిల్లా: అమరావతి రైతుల పాదయాత్రపై ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు.. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌లకు ఫిర్యాదు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ రాజకీయ యాత్రగా మార్చివేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల మీదగా టీడీపీ పాదయాత్ర మార్చాలని ఆయన ఎస్పీని కోరారు.

 
రైతుల పాదయాత్రలా కాకుండా టీడీపీ రాజకీయ యాత్రగా మార్చి హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 157 మందితో పాదయాత్రకు హైకోర్టు అనుమతిస్తే 2 వేల మందితో పాదయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదని, యాత్ర రాజకీయ రంగు పులుముకుందని, దానికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు.

తాజా ఫోటోలు

Back to Top