ర‌హ‌దారి నిర్మాణ‌ ప‌నులు ప‌రిశీలించిన ఎమ్మెల్యే శ్రీ‌దేవి

క‌ర్నూలు:  ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోని హోసూర్ నుంచి మొలగవల్లికి వెళ్లే రహదారి పనులను ఎమ్మెల్యే శ్రీ‌దేవి ప‌రిశీలించారు. అధికారులు మరియు కాంట్రాక్టర్ తో కలిసి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప‌నుల నాణ్య‌త వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు బాగా జరుగుతున్నాయని, వీలైనంత తొందరగా రహదారిని పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుక రావాలన్నారు. పంట పొలాలలో పనిచేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడారు. ఈ రహదారి లేక ఎన్నో సంవత్సరాలుగా చాలా అవస్థలు పడ్డామని.. మీరు మా సమస్యను గుర్తించి రోడ్డు వేస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top