జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం రోజు వైయస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్కొన్నారు. నిజంగా ఇది సీఎం వైయస్ జగన్ పెళ్లి కానుక అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా ఉదయభాను మాట్లాడారు. సీఎం వైయస్ జగన్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్యే ఉదయభాను తెలిపారు.
వందేళ్లు అన్యోన్యంగా జీవించాలని మనసారా కోరుకున్నారు. పెళ్లి కానుకగా రైతులకు 36 వేల ఎకరాల్లో సిరుల పంట పండేందుకు కన్న కలలు నిజమయ్యాయి. ఆ రోజు 2005లో వైయస్ రాజశేఖరరెడ్డి వేదాద్రి-నందిగామకు శంకుస్థాపన చేస్తే..ఈ రోజు మీ హయాంలో 36 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారంటే నిజంగా ఇది పండుగ దినమే. ఈ రోజు మీరిచ్చిన సహకారంతో ఎకరానికి రూ.10 లక్షల విలువ పెరిగింది. కృష్ణానది తీరాన ఉన్న పవిత్ర వేదాద్రి లక్ష్మినరసింహ స్వామి పాదాల చెంత ఈ రోజు మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేయడం ఆ ప్రాంత ప్రజల అదృష్టం.
సాగునీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉంది. కరోనా లేకుంటే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చేవాళ్లం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, రైతు బాంధవుడైనందుకు రైతులు సంబరపడుతున్నారు. ఇవాళ జలాశయాలన్ని కూడా నిండుకుండలా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉందని ఉదయభాను పేర్కొన్నారు.