ప్రతి ఇంటిలో అన్నగా  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఇంటిలో అన్నగా ఉంటూ మహిళల ఆభివృద్ధికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. సోమవారం నగరి ఎమ్మెల్యే రోజా ఎంపీ మిథున్‌రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైందని   అన్నారు.   మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కేవలం అమరావతిలో భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top