ప్రత్తిపాడులోని ప్రాజెక్టులను పునరుద్ధరించండి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌
 

 

అమరావతి: పాదయాత్రలో ప్రజలందరి సమస్యలు తెలుసుకొని వారి మేలు కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేయడం హర్షణీయమని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వ్యవసాయంపై ఆధారపడి ఉందని, నియోజకవర్గంలో తిమ్మరాజు చెరువు, చంద్రబాబుసాగర్, సుబ్బారెడ్డి సాగర్, పెద్దబాపణదొర ప్రాజెక్టులు ఉన్నాయని, ఇవన్నీ వర్షాధారంతో నిండితే రైతులు పంటలు పండించే పరస్థితి ఉందన్నారు. గతంలో కొట్టుచింతల ప్రాజెక్టుగా ఉన్న ఆ ప్రాజెక్టు పేరు మా చిన్నాన్న పర్వత సుబ్బారావు చంద్రబాబు సాగర్‌ ప్రాజెక్టుగా మార్చితే చంద్రబాబు ఆ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టులన్నీ పునరుద్ధరించాలని కోరారు. రౌతలపాడు మండలంలో కనీసం జూనియర్‌ కళాశాల కూడా లేదని, ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రత్తిపాడు మండలంలో కూడా కాలేజీలు లేవని, అక్కడ కూడా కాలేజీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top