టీడీపీ పాలనకు ప్రజల చరమగీతం..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు..

శ్రీకాకుళం:రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడబోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజల అభిమానం,ఆశీర్వాచనాలు వైయస్‌ జగన్‌కు ఉన్నాయన్నారు. ఈ నెల 9న పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురం ప్రజా సంకల్పయాత్ర విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరించనున్నారన్నారు. ఈ బృహత్తర ఘట్టం చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చాపురం చేరుకుంటున్నారన్నారు.పాదయాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు.కఠోర శ్రమ,చిత్తశుద్ధితో జననేత పాదయాత్ర విజయవంతంగా సాగుతుందన్నారు.టీడీపీ అన్యాయాలు,అక్రమాలపై ప్రజలు దుమ్మెతిపోస్తున్నారన్నారు.

–పాదయాత్ర ప్రపంచ రికార్డు: వైయస్‌ఆర్‌సీపీ నేత గుర్‌నాథ్‌రెడ్డి

వైయస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రపంచంలోనే రికార్డు అని వైయస్‌ఆర్‌సీపీ నేత గురునాథ్‌ రెడ్డి అన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు,కుతంత్రాలతో ప్రజలను ఏవిధంగా మోసం చేశారో ప్రతి బహిరంగ సభలోనూ వైయస్‌ జగన్‌ ఎండగడుతున్నారన్నారు.జననేత రూపొందించిన నవరత్నాల పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పాదయాత్ర ద్వారా  వైయస్‌ జగన్‌ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు.

Back to Top