జూమ్‌ టీవీల్లో మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు 

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 
 

విశాఖపట్నం : చ‌ంద్ర‌బాబు జూమ్‌ టీవీల్లో మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితుల్లో లేర‌ని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడుకు అభ్యంతరమెందుకని ఆయ‌న ప్ర‌శ్నించారు. శ‌నివారం విశాఖ‌లో ధ‌ర్మ‌శ్రీ మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తవుతుంది. కేవలం 10వేల కోట్ల చొప్పున వెచ్చిస్తే అమరావతి, కర్నూల్‌, విశాఖలో రాజధానుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని విశాఖ రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకిస్తే ఉద్యమాలు తప్పవన్నారు. చంద్రబాబునాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమన్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే వారి రాజకీయ సమాధి ఖాయమని ధర్మశ్రీ ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

Back to Top