ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డు

 ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

విశాఖ: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డు పడుతున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబుకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. విశాఖకు కేవలం పెళ్లి పనుల కోసమే వచ్చాడని, ఈ అంశాన్ని కూడా రాజకీయంగా మలుచుకునేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేశారన్నారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగితే ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచన లేదు.

తాజా ఫోటోలు

Back to Top