వైయ‌స్ జ‌గ‌న్‌ పాలనను చూసి ఓర్వలేక టిడిపి ఆరోపణలు  

ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 

నెల్లూరు జిల్లా: వైయ‌స్ జ‌గ‌న్‌ పాలనను చూసి ఓర్వలేక టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. నెల రోజుల పాలనలో ఎన్నో ప్రజా ప్రయోజన నిర్ణయాలను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి తీసుకున్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఏవైతే హామీలను ఇచ్చారో.. అవి అమలు చేస్తున్నారని తెలిపారు. నదీ జలాలను సద్వినియోగ  పర్చుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన కారణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. భద్రత పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం సరికాదు. ఆయనకు నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భద్రతను కల్పిస్తోందన్నారు. వ్యవసాయం పై కనీస అవగాహన లేని లోకేష్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Back to Top