కళ్యాణదుర్గం : వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పేదలకు మరింత మేలు జరుగుతుందని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ తలారి రంగయ్య అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (విద్యా నగర్) లో తలారి రంగయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని స్థానిక ప్రజలను తలారి రంగయ్య కోరారు.