కరోనా బాధితులపై చిన్నచూపు తగదు 

ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి

అనంతపురం: క‌రోనా బాధితుల ప‌ట్ల చిన్న‌చూపు త‌గ‌ద‌ని ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి అన్నారు. అనంత‌పురంలోని జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంపై  అనంత వెంకటరామి రెడ్డి సీరియస్‌‌ అయ్యారు. సోమవారం  అనంతపురం జీజీహెచ్‌లో కరోనా బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై చిన్నచూపు తగదు. వైద్యులు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా ఎందుకీ నిర్లక్ష్యం...? ప్రభుత్వ వైద్యుల్లో బాధ్యత పెరగాలి.

ప్రైవేటు డాక్టర్ల దోపిడీ తగదు
కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాల‌ని, కరోనా కష్టకాలంలో ప్రైవేటు డాక్టర్ల దోపిడీ తగదని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కరోనా పరీక్షల పేరుతో ఒక్కొ సీటీ స్కాన్‌కు రూ. 5,000 వసూలు చేయటం బాధాకరం. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు తప్పవు!. కరోనా బాధితులకు భరోసా ఇవ్వాల్సింది వైద్యులే. కోవిడ్ వారియర్స్‌కు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా ఉంటారని' ఎమ్మెల్యే అనంత పేర్కొన్నారు. 

Back to Top