చంద్రబాబు చేస్తున్న కుట్రే సునామి అలజడి 

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌

 విశాఖపట్నం: విశాఖ అభివృద్ధిని అడ్డుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రే సునామి అలజడిగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ అభిప్రాయపడ్డారు. సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విశాఖపట్నంపై పచ్చనేతలు విషప్రచారం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రోజున విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా విశాఖ నగరం భద్రంగా నిలిచింది. హుద్‌హుద్ నుంచి కైలాసగిరి విశాఖ నగరాన్ని కాపాడిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..? ప్రపంచంలోని చాలా నగరాలు సముద్రతీరంలోనే ఉన్నాయి. అవన్నీ సునామీలో కొట్టుకుపోతాయా?  అని ప్ర‌శ్నించారు. గతంలో సునామీ వచ్చినప్పుడు కూడా విశాఖ నగరానికి ఎలాంటి నష్టం జరగలేదు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయాన్ని అన్ని రకాలుగా అడ్డుకోవడానికి తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు సముద్ర తీరంలోనే విలసిల్లుతున్నాయని ఆ నగరాలకు లేని ప్రమాదం విశాఖ నగరానికి ఏ రకంగా వస్తుందంటూ టీడీపీ నేత‌ల‌ను నిల‌దీశారు.

Back to Top