వలస కూలీలకు వైయస్‌ఆర్‌సీపీ నేతల అండ

ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి ఆధ్వర్యంలో భోజనాలు
 

పశ్చిమ గోదావరి: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వలస కార్మికులకు అండగా నిలుస్తున్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు, ఏలూరులో వలస కూలీలకు ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే వలస కార్మికులకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బాయ చౌదరి మాట్లాడుతూ..సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో అడుగుపెట్టిన ప్రతి వలస కూలీకి కడుపు నిండ అన్నం పెట్టి, వారిని సురక్షితంగా బస్సుల్లో పంపిస్తున్నామన్నారు. వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, భోజనం, పళ్లు అందజేస్తున్నట్లు అబ్బాయ చౌదరి తెలిపారు.
 

Back to Top