ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించిన మంత్రి విశ్వ‌రూప్‌

తూర్పు గోదావ‌రి:  గోదావ‌రి నదీ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత‌మైన కోన‌సీమ‌ను మంత్రి పెనిపే విశ్వ‌రూప్ ప‌రిశీలించారు. వ‌ర‌ద ఉధృతి కార‌ణంగా చాలా ప్రాంతాల్లో కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. ఇళ్ల‌లోకి నీరు చేరింది. ఈ ప్రాంతాల్లో మంత్రి ప‌ర్య‌టించి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను, పున‌రావాస కేంద్రాల‌ను ప‌రిశీలించారు. బాధితుల‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 68 పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. 6 వేల మందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఎన్డీఆర్ఎఫ్‌, ఎన్టీ ఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిన‌ట్లు పేర్కొన్నారు. గోదావ‌రి ప్రాంత ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విశ్వ‌రూప్ సూచించారు.  తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట లో ముంపు ప్రాంతాల‌ను సంద‌ర్శించిన ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి ప‌రిశీలించారు. బాధితుల‌తో మాట్లాడారు. 
 

Back to Top