2008లోనే పాల-ఏకరిలను వైయ‌స్ఆర్ బీసీలుగా గుర్తించారు

మంత్రి వేణుగోపాలకృష్ణ 

 తాడేప‌ల్లి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లోనే పాల-ఏకరిలను బీసీలుగా గుర్తించారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పాల-ఏకరి కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్  కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. సోమవారం పాల-ఏకరి కార్పొరేషన్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీల అమలు దిశగా పాలన జరుగుతోంది. విద్య, వైద్య రంగంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ నూతన విప్లవం తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు’’ అని అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top