విజ‌య‌వాడ అభివృద్ధి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంతోనే  సాధ్యం

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

విజ‌య‌వాడ‌:  విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్ధి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంతోనే సాధ్య‌మ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.   సోమ‌వారం  విజ‌య‌వాడ 40వ డివిజ‌న్‌లో మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌తి ఇంటికి కూడా ఒక‌టి, రెండు, మూడు ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అందాయ‌ని చెప్పారు. మ‌ళ్లీ జ‌గ‌న‌న్న రావాల‌ని ప్ర‌జ‌లంతా కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఏ వార్డుకు వెళ్లినా కూడా ఓట‌ర్ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ఎవ‌రిని నిల‌బెట్టినా కార్పొరేట‌ర్లుగా అత్య‌ధిక మెజారిటీతో గెలిపిస్తామ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌న్నారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగుర‌వేస్తామ‌ని మంత్రి ధీమా వ్య‌క్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top