జనసేన జనం కోసం చేసిందేమీ లేదు

మంత్రి శంకర్ నారాయణ 
 

అనంత‌పురం: జ‌న‌సేన పార్టీ జ‌నం కోసం చేసింది ఏమీ లేద‌ని రాష్ట్ర మంత్రి శంక‌ర్ నారాయ‌ణ విమ‌ర్శించారు.  పాల‌న వికేంద్రీక‌ర‌ణ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో శ‌నివారం అనంతపురం జిల్లా పెనుకొండలో దివంగ‌త మ‌హానేత‌ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ..    మూడు రాజధానులకు ఇది సమయం కాదని పవన్ కల్యాణ్ అంటున్నారని, మరి ఇది షూటింగులకు సరైన సమయమా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గానీ, జనసేన గానీ ప్యాకేజీ కోసం తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top