బాబూ.. వ్యాక్సీన్ల‌పై ప్ర‌ధాని మోదీని ప్ర‌శ్నించూ ?

మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌
 

అనంత‌పురం:  వ్యాక్సిన్ల గురించి ప్ర‌ధాని నరేంద్ర‌మోదీని ప్ర‌శ్నించే ద‌మ్ము ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు లేద‌ని  మంత్రి శంక‌ర నారాయ‌ణ అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల వ్యాక్సినేష‌న్ కోసం చర్య‌లు తీసుకుంటోంద‌ని, చంద్ర‌బాబు వ్యాక్సిన్ గురించి మోడీని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చోని జూమ్‌లో మాట్లాడుతున్నారని, క‌రోనా భ‌యంతో బ‌య‌ట‌కు రాకుండా ఉన్నార‌ని విమ‌ర్శించారు.  14 సంవ‌త్స‌రాల్లో ప్ర‌జారోగ్యాన్ని ప‌ట్టించుకోకుండా గాలికి వ‌దిలేశార‌ని అన్నారు.  వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన బాబు ఇప్పుడు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.  

అధికారులలో మ‌నోస్థైర్యం  నింపాలికానీ, అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని, పార్టీ ప‌రంగా కూడా కోవిడ్ బాధితుల‌కు స‌హాయం చేస్తున్నామ‌ని అన్నారు.  రాష్ట్రంలో ఆక్సీజ‌న్ నిల్వ‌లు అవ‌స‌రం మేర‌కు ఉన్నాయ‌ని, ఎక్క‌డా కొర‌త లేద‌ని, ప్ర‌స్తుతం డాక్ట‌ర్ల కొర‌త కూడా లేద‌ని మంత్రి శంక‌ర నారాయ‌ణ పేర్కోన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top