చంద్ర‌బాబువి కుట్ర రాజ‌కీయాలు

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కుట్ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మండిప‌డ్డారు. సస్పెండ్ జ‌డ్జి రామ‌కృష్ణ సోద‌రుడిపై దాడి జ‌రిగితే మాకు అంటగ‌ట్టాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పోలీసుల విచార‌ణ‌లో దాడి చేసింది టీడీపీ నేత ప్ర‌తాప్‌రెడ్డి అని తేలింద‌న్నారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌తాప్‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్తని తేలితే రాజ‌కీయాలు మానుకుంటాన‌ని పెద్దిరెడ్డి స‌వాలు విసిరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top