కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారు

డిప్యూటీ సీఎం నారాయణస్వామి

చిత్తూరు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరును చంద్రబాబు తప్పుబట్టడం సిగ్గు చేటన్నారు.

అధికారులను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. కలెక్టర్లు, ఎస్పీలను అవమానపరిచే విధంగా చంద్రబాబు తీరు ఉందని వారికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు.   

Back to Top