కేంద్ర నుంచి స‌హాయం కావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరారు

మంత్రి క‌న్న‌బాబు
 

తాడేప‌ల్లి: ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకునేందుకు కేంద్రం నుంచి స‌హాయం కావాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కేంద్ర బృందాన్ని కోరిన‌ట్లు మంత్రి క‌న్న‌బాబు తెలిపారు. ఇవాళ క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను కేంద్ర బృందం భేటీ అయ్యింద‌ని మంత్రి పేర్కొన్నారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల చాలా ప్రాంతాల్లో పంట‌లు దెబ్బ‌తిన్నాయ‌ని, ఆక్వా చెరువులు, రోడ్లు సైతం దెబ్బ‌తిన్నాయ‌న్నారు. కేంద్రం నుంచి సహాయం అందించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరిన‌ట్లు  తెలిపారు. కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంప‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమీత్‌షాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపార‌ని మంత్రి క‌న్న‌బాబు చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా స‌హాయం అందేలా చూస్తామ‌ని కేంద్ర బృందం చెప్పిన‌ట్లు తెలిపారు. వ‌రి, వేరుశ‌న‌గ‌తో పాటు క్వాలిటీ ఉన్న వాటిని సైతం కొనుగోలు చేసేలా చూడాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించార‌న్నారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top