లోకేష్..ఓ పిచ్చి కుక్క‌

మంత్రి గుమ్మనూరు జయరాం

విజయవాడ:  టీడీపీ నేత నారా లోకేష్‌ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం మండిప‌డ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకోకపోతే లోకేష్‌ను ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. ‘‘151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మగాడు సీఎం వైయ‌స్ జగన్. మీ నాన్న నిన్ను కూడా గెలిపించుకోలేకపోయాడంటూ’’ మంత్రి ఎద్దేవా చేశారు.

మంగళగిరిలో లోకేష్‌ను పిచ్చికుక్కను కొట్టినట్లు తరిమికొట్టారన్నారు. ‘‘టీడీపీ హయాంలో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగింది. టీడీపీ నేతలు మా నేతను హత్య చేశారు.. అప్పుడు లోకేష్ ఏమయ్యాడు’’ అంటూ మంత్రి ప్రశ్నించారు.  చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ ఏం చేసినా కర్నూలులో టీడీపీకి భవిష్యత్‌ ఉండదని  అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం పేర్కొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top