మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

విశాఖ:  మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విశాఖలో ఐకానిక్‌ టవర్ల ఏర్పాటుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ ప్రమోషన్లను మరింత పెంచాలని మంత్రి ఆదేశించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు ఉన్నాయన్నారు. సీఈవోల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top