విజయవాడ: మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వప్నమన్నారు. టెక్నాలజీలో ఏపీని అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే మూడేళ్లలో లక్ష్యాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.