బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మంత్రి గౌతంరెడ్డి
 

విశాఖ: విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో జరిగిన ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. బాధితులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్యాస్ లీకేజీ తగ్గడంతో ఆర్‌ఆర్‌ వెంకటాపురంతో పాటు చట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు మొదలుపెట్టారని తెలిపారు. ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.   తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు.. బాధితులకు అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.  అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని గౌతంరెడ్డి చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top