ఇది ప్రజా ప్రభుత్వం..ప్రజలకు అండగా ఉంటాం

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌
 

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. వెంకటాద్రి నగర్‌లో  ఎస్సీ, బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సోమవారం రాత్రి నిద్రచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు మనోధైర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Back to Top