పులిచింతల ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రి అనిల్

అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. 16వ నంబర్‌ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్‌ విరిగిపోయిందని మంత్రి అనిల్‌ తెలిపారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో 16వ నంబర్‌ గేట్‌ ఊడిపోయిందని వివరించారు. ఇద్దరు ఇప్పటికే ప్రాజెక్టు ఇంజనీర్లు, నిపుణులు పరిశీలించారని, మరో రెండు ఇంజనీరింగ్ నిపుణుల బృందాల్ని పిలిపించామని మంత్రి పేర్కొన్నారు.

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top