అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో రోజు రోజుకు వాస్తవాలు బయటకొస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. చర్చకు రమ్మంటే సభ నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారని విమర్శించారు. అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారని తప్పుపట్టారు.