బ్లాక్‌ ఫంగస్‌ పేషెంట్లకు అవసరమైన వైద్యం అందించాలి   

హెల్ప్‌ డెస్క్‌ల పనితీరుపై మంత్రి ఆళ్ల నాని ఆరా
 

 ఏలూరు: బ్లాక్‌ ఫంగస్‌ పేషెంట్లకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.  పశ్చిమగోదావరి జిల్లాలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై  డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌ సూపరింటెండెంట్లతో ఆళ్ల నాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఐసీయూ, నాన్‌ ఐసీయూ బెడ్స్‌ ఆధారంగా ఆక్సిజన్‌ సదుపాయం ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వాడుకోవాలని మంత్రి సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top