సీఎం వైయ‌స్‌ జగన్‌ దళిత పక్షపాతి 

మంత్రి ఆదిమూలపు సురేష్‌

 తాడేపల్లి: సీఎం వైయ‌స్‌ జగన్‌ దళిత పక్షపాతి అని విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు.  మంచి స్థానాల్లో దళిత అధికారులకు సీఎం వైయ‌స్ జగన్‌ అవకాశం ఇచ్చార‌ని మంత్రి అన్నారు.  ప్రతి పీఆర్సీ అమలులో ఇబ్బందులు ఉంటాయని అవి చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని అన్నారు. 'నేను ఉద్యోగిగా 6 పీఆర్సీలు చూశా. అప్పుడూ ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఉద్యోగులకు సమస్యలు రావడం సర్వసాధారణం. గెజిటెడ్ అధికారులకి సమస్యలు ఉన్నా రోడ్లు ఎక్కి ఆందోళన చెయ్యరు. గౌరవంగా మాట్లాడి పరిష్కరించుకుంటారు. గతంలో దళిత అధికారులు అంటే చులకన భావం ఉండేది. పోస్టింగ్, ప్రమోషన్లలో అన్యాయం జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇలాంటి అసోసియేషన్ వల్ల న్యాయం జరుగుతుంద‌ని మంత్రి చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top