మేమంతా సిద్ధం - 5వ రోజు షెడ్యూల్ 

అనంత‌పురం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు  వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం  బ‌స్ యాత్ర సంజీవపురం రాత్రి  బస ప్రాంతం నుండి సోమ‌వారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
పట్నం  నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా  కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని  పి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన  ఇఫ్తార్ విందు లో పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా  చీకటిమనిపల్లెలో  రాత్రి బస కు చేరుకుంటార‌ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త‌ల‌శీల ర‌ఘురామ్ తెలిపారు.
 

Back to Top