అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి ఆలస్యంగా గుర్తించారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని తెలుసుకున్న ఆయన దీనిపై ట్విట్టర్ సంస్థతో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను వివరిస్తూ గౌతంరెడ్డి ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు కనపడినందుకు తన ఫాలోవర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.