నవంబర్‌లో 'ఇండస్ట్రీస్ స్పందన' ప్రారంభం 

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమరావతి: పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు ప్రజలు మరింత దగ్గరయ్యేందుకు, ఏ సమస్యకైనా సత్వరమే పరిష్కారం దిశగా పరిశ్రమల శాఖ అడుగులువేస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీపై చర్చించారు. అలాగే పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రత్యేక 'స్పందన' వెబ్ సైట్‌ను నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ వెబ్ సైట్ ప్రారంభంతో పరిశ్రమల శాఖలో జవాబుదారీ, పారదర్శకత పెరుగనుందన్నారు. పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి సందేహం, ఫిర్యాదైనా సత్వరమే స్పందన లభించనుందని తెలిపారు 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top