తుంగభద్ర పుష్కరాలు..సీఎం వైయ‌స్ జగన్‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి :  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాలను కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ప్రారంభించాలంటూ సీఎం వైయ‌స్ జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించిన మఠం ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top