క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే సీఎం ధ్యేయం 

  శాప్ లీగ్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన క‌ర్నూలు మేయ‌ర్ 
 

క‌ర్నూలు: రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించటమే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ధ్వేయమని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో శాప్ లీగ్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులు మీద ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారని, దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డి.ఎస్.ఏ. సి.ఈ.ఓ. సెట్కూర్ పి.వి. రమణ, డి.ఎస్.ఏ ఛీఫ్ కోచ్ బి.భూపతిరావు, స్పాన్సర్ ఎస్.ఏ. శరిఫ్, క్రీడా సంఘం నాయకులు అవినాష్, సినియర్ క్రీడాకారులు జాఫర్ మున్నా, ఫిజికల్ డైరెక్టర్ సత్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top