సింగిల్ బెంచ్‌ ఆదేశాలపై డివిజ‌న్ బెంచ్‌ స్టే

ప‌రిష‌త్  ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్‌ బెంచ్ ఆదేశాలు నిలిపివేత

 అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్‌ ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్‌ బెంచ్ ఆదేశాలను నిలిపి వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ స్టే విధించింది. జులై 27న సమగ్ర విచారణ జరుపుతామని డివిజన్ బెంచ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వుల వరకు కౌంటింగ్, ఫలితాలు నిర్వహించకూడదని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని ఎస్‌ఈసీ లాయర్‌ కోర్టుకు వివరించారు.

Back to Top