వైయస్‌ఆర్‌సీపీలోకి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు..

వైయస్‌ జగన్‌ సమక్షంలోపార్టీలోకి చేరిక...

హైదరాబాద్‌: ఎన్నికల ముందు అధికార పార్టీకి షాక్‌ మీద షాక్‌ తగులుతుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైయస్‌ జగన్‌ సమక్షంలో గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.డాక్టర్‌ పొన్నం నాగ మల్లిఖార్జునరావు,టీడీపీ నేత వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి వైయస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని వారు తెలిపారు.

 

Back to Top