వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన గిద్దలూరు టీడీపీ నేతలు

హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చంద్రబాబు అరాచకపాలనతో విసిగిపోయిన సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన పలువురు నాయకులు, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జననేతను కలిశారు. గిద్దలూరు సమన్వయకర్త అన్నా రాంబాబు ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో గిద్దలూరు ఎంపీపీ వంశీధర్‌రెడ్డి, అర్ధవీడు ఎంపీపీ రవికుమార్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్‌ విండో సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎదురు శ్రీనివాస్‌రెడ్డి, ఉడుముల సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డిలతో పాటు మరో 40 మంది నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వారికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆç్వనించారు. 

Back to Top