టీడీపీ సభ్యులు అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

అమరావతి: టీడీపీ సభ్యులు అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అలజడి సృష్టించాలనే ఉద్దేశంతోనే సభకు వచ్చారని విమర్శించారు. ప్రతి అంశంపైనా అధికార పార్టీ సుదీర్ఘ వివరణ ఇచ్చిందన్నారు. పోలవరంపై టీడీపీకి అనుమానాలు ఉంటే చర్చలో ఎందుకు పాల్గొనలేదన్నారు. పోలవరంపై సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. సభలోకి వచ్చి గొడవ చేసి వెళ్లిపోవడమే టీడీపీ సభ్యులు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని దుయ్యబట్టారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top