మాజీ మంత్రి ఖలీల్‌ బాషా మృతికి నేత‌ల సంతాపం 

వైయ‌స్ఆర్  జిల్లా:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి డా. ఎస్‌ఏ ఖలీల్‌బాషా గుండెపోటుతో  మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.   ఖలీల్‌బాషా పట్ల డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి,  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. ప్రజల నాడి పసిగట్టిన నేతగా గుర్తింపు పొందిన ఖలీల్‌ బాషా  1974 నుంచి రెండు రూపాయల ఫీజుతో వైద్యం చేస్తూ విస్తృత ప్రాచుర్యం పొందారు.  2019 ఎన్నికలకు ముందు తన ముగ్గరు కుమారులతో  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయ‌స్సార్‌సీపీ విజయానికి కృషి చేశారు.  

తాజా వీడియోలు

Back to Top