మంచి వ్యక్తిని కోల్పోయాం

మేకపాటి భౌతిక కాయానికి విశ్వేశ్వ‌ర‌రెడ్డి నివాళులు
 

నెల్లూరు: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న తదితరులు నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని విశ్వేశ్వరరెడ్డి ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి మరణవార్త విని షాక్‌కు గురయ్యానని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top