వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే బాబ్జీ 

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లాకు చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శారద, పలువురు కౌన్సిలర్లు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అలాగే గుంటూరు జిల్లాకు మాజీ ఎమ్మెల్యే తాడిచెట్టి వెంకట్రావ్‌ సోదరుడు తాడిశెట్టి మురళి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ కూడా వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి వైయస్‌ జగన్‌ ఆహ్వానించారు. 
 

Back to Top