ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైయస్‌ జగన్‌

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

 

తూర్పుగోదావరి: ఇచ్చిన మాటను నెరవేర్చే మనస్తత్వం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంతమని వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని 25వ డివిజన్‌ వాసులు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో సంతోషాలు నింపుతారన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. 

Back to Top