నేడు ఇడుపుల‌పాయ‌కు వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  సుధీర్ఘ పాదయాత్రను ముగించుకున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  వైయ‌స్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం కాలినడకన సామాన్య భక్తుడిలా తిరుమల చేరిన ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  శ్రీవారి దర్శనం పూర్తిచేసుకున్నారు. శుక్ర‌వారం కడపలోని అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించారు. ఇవాళ పులివెందులలో సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నేరుగా ఇడుపులపాయకు చేరుకొని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.  

Back to Top