తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (27.01.2024) విశాఖపట్నం జిల్లా భీమిలిలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర రీజియన్ వైయస్ఆర్‌సీపీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం తంగివలస చేరుకుంటారు, అక్కడ జరిగే ఉత్తరాంధ్ర రీజియన్ వైయస్ఆర్‌సీపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.