తగ్గిన పాజిటివ్‌ కేసుల రేటు..పెరిగిన రికవరీ

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు
 

 
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల రేటు తగ్గి, రికవరీ రేటు పెరిగింది. బుధవారం కొత్తగా మరో 48 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కి చేరుకుంది. గత 24 గంటల్లో 9284మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 48 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. కొత్తగా  గుంటూరు జిల్లాలో 12,  చిత్తూరు జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 7 , కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జల్లాలో 4,అనంతపురం జిల్లా నుంచి 3 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లా నుంచి ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 47కు చేరింది.

కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఏపీలో క్రమంగా పెరుగుతుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కంటే డిశ్చార్జి కేసుల సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల రేటు 1.07 శాతం కాగా, దేశంలో 4.02 శాతం ఉంది.రికవరీ రేటు ఏపీలో 51.49 శాతం ఉంటే, దేశంలో 32.82 శాతం నమోదు అయ్యింది. తాజాగా  గత 24 గంటల్లో కొత్తగా 86 మంది డిశ్చార్జ్‌ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1142కి చేరింది. డిశ్చార్జి అయిన వారిలో  గుంటూరు 27, కృష్ణా  25 , కర్నూలు 13, కడప 10, తూర్పు గోదావరి 4, పశ్చిమ గోదావరి 4, అనంపురం, నెల్లూరు, శ్రీకాకుళం నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జ్‌ అయ్యారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 948 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 

Back to Top